యూవీ క్రియేషన్స్ మూవీ ఆన్ జనవరి 14
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో కళ్యాణం కమనీయం మూవీ జనవరి 14 నా రిలీజ్ కానుంది. ఈ మూవీ అస్సలు బజ్ లేకుండా రిలీజ్ అవుతుంది కానీ పాజిటీవ్ టాక్ వస్తే గనుక హిట్టయ్యే అయ్యే చాన్స్ ఉంది. మూవీ జెనెర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మూవీ డైరెక్టర్ అనిల్ కుమార్ ఆళ్ల హీరో సంతోష్ శోభన్ కు జోడి గ ప్రియా భవాని శంకర్ నటించింది, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్.
అయితే ఈ సినిమా హిట్టవ్వాలంటే ఏదో మేజిక్ జరగాలి. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ పెద్ద వలయమే ఉంది. ఈ మూవీ రిలీజయ్యే నాటికే ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘తెగింపు’ సినిమాలు విడుదవుతాయి. ఈ నాలుగింటిలో ఏ రెండు సినిమాలకు పాజిటీవ్ టాక్ వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాకు చిక్కు ఎదురవుతుంది. థియేటర్‌లు దాదాపు దొరకవు. ఒక వేళ దొరికిన పరిమిత సంఖ్యలోనే దొరుకుతాయి.
మరి ఇంత రిస్క్ చేసి యూవీ ఈ సంస్థను ఎందుకు రిలీజ్ చేస్తుందో వాళ్లకే తెలియాలి. అయితే గతంలో కూడా 2016 సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సినిమాలకు పోటీగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ను దింపింది. అప్పటి వరకు పెద్ద ప్రమోషన్‌లు కూడా చేయలేదు. కానీ ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించి యూవీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు మళ్లీ సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’, ‘జై సింహా’ సినిమాలకు పోటీగా ఒక వారం తర్వాత ‘భాగమతి’ సినిమాను రిలీజ్ చేసింది. అయితే అప్పటికే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భాగమతి సినిమాకు కలిసి వచ్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి