రాయలసీమ బ్యాక్ డ్రాప్ కధలు చెయ్యాలంటే బాలయ్య తరవాతే ఎవరినా
చెన్నకేశవరెడ్డి, సమరసింహ రెడ్డి, నరసింహనాయుడు తో.... బాక్సాఫీస్ నీ షాక్ చేసాడు.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కి ఊపిరి పోసాడు. మరోసారి అదే పంధా లో వీర సింహరెడ్డి తో
సంక్రాంతి కి మన ముంది లి రాబోతున్నాడు. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని
దర్శకుడు. ఈనెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్
బయటకు వచ్చింది. పేరుకు, బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగానే ట్రైలర్‌ని కట్ చేశారు.
యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేశారన్న సంగతి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
”సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని నేనొక్కడినే కత్తి పట్టా… పరపతి కోసమో..
పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత నాది ఫ్యాక్షన్ కాదు..
సీమపైన ఎఫెక్షన్..” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.
అక్కడి ఉంచి… బాలయ్య ఊచకోత మొదలు. ”మైలు రాయికి మీసం మొలిచినట్టు
ఉండాదిరా…” అనే డైలాగ్ తో.. బాలయ్య క్యారెక్టర్ లో ఉన్న పొగరు చూపించారు. ”
పది నిమిషాల్లో క్లోజయ్యే ఏ పబ్బు దగ్గరైనా వెళ్లి నిలబడు… అక్కడ నీకో స్లోగన్
వినిపిస్తుంది..” అనగానే ‘జై బాలయ్య…’ సౌండ్‌తో దద్దరిల్లిపోయింది.”
అప్పాయింట్ మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. లొకేషన్ చూడను….
ఒంటిచేత్తో ఊచకోత, కోస్తా నా కొడకా…” ”సంతకాలు పెడితే… బోర్డు మీద పేరు
మారుతుందేమో? కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు… మార్చలేరు..”
”పదవి చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువ…” లాంటి
సంభాషణలు ట్రైలర్‌లో వినిపించాయి. ఇవి సీఎ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి కి
పరోక్ష మొట్టికాయలు అని బాలయ్య ఫాన్స్ మరియు టీడీపీ క్యాడర్ సంబరాలు
చేసుకుంటున్నారు సోషల్ మీడియా లో.
బాలయ్య డైలాగులు వింటుంటే.. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు, అందులోని బాలయ్య
పాత్రలు గుర్తొస్తున్నాయి.
మేకింగ్ పరంగా.. మైత్రీ మూవీస్ ఎక్కడా రాజీ పడలేదు. తమన్ తన బ్యాక్ గ్రౌండ్
స్కోర్ తో వీర విహారం చేశాడు. మొత్తానికి వీర సింహారెడ్డి బాలయ్య అభిమానులకు
నచ్చేలా ఉండబోతోందన్న భరోసా ట్రైలర్ ఇచ్చేసినట్టైంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి