వారసుడు
రీసెంట్ గా వారిసు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కి ముందు ఉన్న బజ్ అంత పోయినట్టు అయ్యింది. ట్రైలర్ చూసిన తరువాత తెలుగులో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయనిపించడం ఖాయం. ఉమ్మడి కుటుంబం, సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో ఒక సమస్య రావడం, హీరో తండ్రి వ్యాపారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించే స్టైలిష్ విలన్.. వీటన్నింటికీ చెక్ పెట్టి మళ్లీ తన ఫ్యామిలీని ఒక్కటిగా చేసే హీరో. విజయ్ లాంటి స్టార్ హీరో కోసం వంశీ పైడిపల్లి రొటీన్ ఫ్యామిలీ స్టోరీని రాసుకోవడంతో నెటిజన్లు ‘వారసుడు’ ట్రైలర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
దాదాపు ఇదే కథతో ఇప్పటికే మన స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు సినిమాలు చేసేశారు. కోలీవుడ్ లో ఎంట్రీ కోసం వంశీ పైడిపల్లి రొటీన్ అనిపించే తెలుగు కథనే అటు ఇటు మార్పులు చేసి తీశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో అయితే ‘బ్రహ్మోత్సవం’, ‘అత్తారింటికి దారేది’, ‘మహర్షి’ సినిమాల ఛాయలు కనిపిస్తున్నారు. ఈ కథ కోసం దిల్ రాజు వందల కోట్లు ఖర్చు చేశారు. సినిమా ప్రమోషన్స్ లో ఎంతో గొప్పగా మాట్లాడారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి